Header Banner

పెళ్లికి వెళ్లి వస్తుండగా కాలువలోకి దూసుకెళ్లిన జీపు.. మృతుల్లో ఐదుగురు మహిళలు, 11 ఏళ్ల బాలిక!

  Sun Feb 02, 2025 13:14        India

వివాహ కార్యక్రమానికి హాజరై తిరిగి ఇంటికి వెళ్తుండగా జీపు అదుపుతప్పి కాల్వలోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో 9 మంది ప్రాణాలు కోల్పోగా, ముగ్గురు గల్లంతయ్యారు. ఇద్దరిని రక్షించారు. హరియాణాలోని ఫతేహాబాద్‌ జిల్లా సర్దారేవాలాలో జరిగిందీ ఘటన. పంజాబ్‌లోని ఫజిల్కా జిల్లాలో జరిగిన పెళ్లికి హాజరైన 14 మంది తిరిగి శుక్రవారం రాత్రి పొద్దుపోయాక ఇంటికి తిరిగి పయనమయ్యారు. ఈ క్రమంలో సర్దారేవాలా గ్రామం వద్ద జీపు అదుపుతప్పి రోడ్డు పక్కనున్న కాలువలోకి దూసుకెళ్లింది. సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. మృతుల్లో ఐదుగురు మహిళలు, 11 ఏళ్ల బాలిక ఉన్నట్టు పోలీసులు తెలిపారు. దట్టంగా కురుస్తున్న మంచు కారణంగానే ప్రమాదం జరిగినట్టు అధికారులు చెబుతున్నారు. దారి కనిపించకపోవడం వల్లే ఈ దుర్ఘటన జరిగిందని ప్రాథమికంగా నిర్ధారించారు. గల్లంతైన ముగ్గురి కోసం సహాయక బృందాలు గాలిస్తున్నాయి. 9 మంది మృతదేహాలను వెలికి తీశారు. మృతులందరూ బంధువులు, ఒకే సామాజిక వర్గానికి చెందిన వారు కావడంతో గ్రామంలో విషాదం నెలకొంది.

 

ఇంకా చదవండి: జగన్ షాక్: సంచలనంగా మారిన షర్మిలతో విజయసాయిరెడ్డి భేటీ.. రాజకీయాలపై మూడు గంటలపాటు చర్చ!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

దేశవ్యాప్తంగా రైతులకు కేంద్రం గుడ్‌న్యూస్! PMDDKY పథకం ఎలా ఉపయోగపడుతుందంటే?

 

మటన్ ప్రియులకు షాకింగ్ అలర్ట్! తిన్న వెంటనే ఇవి తింటే ఏం జరుగుతుందో తెలుసా?

 

బ‌డ్జెట్‌-2025.. మధ్యతరగతికి భారీ ఊరట.. బడ్జెట్ తో ధరలు దగ్గేవి, పెరిగేవి ఇవే!

 

ఆదాయ పన్నుపై కేంద్రం గుడ్ న్యూస్! కొత్త పన్ను విధానంలో.. సీనియర్ సిటిజన్లకు భారీ ఊరట..

 

మ‌హిళల‌కు గుడ్‌న్యూస్.. ఈ ప‌థ‌కం కింద వ‌చ్చే ఐదేళ్ల‌లో రూ. 2కోట్ల వ‌ర‌కు రుణాలు!

 

రాష్ట్రాలకు రూ.1.5 లక్షల కోట్ల రుణాలు ప్రకటించిన కేంద్ర మంత్రి! 50 ఏళ్లకు వడ్డీ రహిత రుణాలు..

 

అమెరికాలో మరో ప్రమాదం.. విమానం కూలడంతో సమీపంలోని ఇళ్లు, కార్లు దగ్ధం!

 

చంద్రబాబు అధ్యక్షతన టీడీపీ పొలిట్‌బ్యూరో భేటీ.. నామినేటెడ్‌ పోస్టులపై చర్చ!

 

చంద్రబాబు అధ్యక్షతన టీడీపీ పొలిట్‌బ్యూరో భేటీ.. నామినేటెడ్‌ పోస్టులపై చర్చ!

 

టీడీపీ కార్యాలయంలో కోపగించుకున్న లోకేష్! ప్రోటోకాల్ పేరుతో పోలీసుల అత్యుత్సాహం!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #RoadAccident #Haryana #CruiserPlunges